బ్రహ్మోత్సవాలు... సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు

రాజరికానికి ప్రతీకగా... మానవత్వాన్ని కిలిగి ఉండాలి ప్రభోదిస్తూ సింహవాహనంపై తిరువీధుల్లో మలయప్ప స్వామిగా శ్రీనివాసుడు ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు ఉదయం సింహవాహనంపై భక్తకోటికి కనువిందు చేస్తూ దర్శనభాగ్యం కలిగించారు.

సింహమంటే శక్తిగా, రాజరికానికి గుర్తుగా భావిస్తారు. భగవద్గీత ప్రకారం జంతువులకు రాజు సింహం. ఈ స్వామివారిని హరిగా కూడా పిలుస్తారు. హరి అంటే సింహం. సింహనుడు అనే పేరును కలిగిన కలియుగ నాధుడు గురువారం ఉదయం సింహ వాహనంపై ఊరేగాడు. సకల అలంకారాలతో మాడ వీధుల్లో ఊరేగుతున్న మలయప్పను భక్తకోటి భక్తి పారవశ్యంతో తిలకించారు.

సింహ వాహనముపై శ్రీవారి దర్శన భాగ్యం కలిగినంతనే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అందువల్లనే ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
WD

వెబ్దునియా పై చదవండి