తిరుపతిలో జరిగే మంగళప్రదమైన ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీవారి బ్రహ్మోత్సవం. తిరుపతిలోని పవిత్ర పుష్కరిణి తీరంలో బ్రహ్మదేవుడు ఆరంభించిన ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. ఈ ఉత్సవాలు ఆయా కాలాల్లో వివిధ దశల్లో నిర్వహించారు.
ఎందరో మహారాజులు తమ విజయ పరంపరకు చిహ్నంగా తిరుమలేశునుకి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అటుంవంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో కలియతిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
కల్పవృక్షం వాహనం అనగా.. కోరిన వారికి మాత్రమే వరాలు ఇచ్చే వాహనం ఈ కల్పవృక్ష వాహనం. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడైన వేంకటాద్రివాసుడు బ్రహ్మోత్సవాల్లో ఊరేగి వాహనాల్లో ఒకటి ఈ కల్పవృక్షం. ఇది అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువు. నాలుగో రోజైన శుక్రవారం ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగాడు.