హనుమంత వాహనంపై ఊరేగిన బ్రహ్మాండ నాయకుడు

తిరుమల బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీమలయప్ప స్వామి హనుమంత వాహనంపై ఊరేగారు. శ్రీమహావిష్ణువు యొక్క శ్రీరాముని అవతారంలో ఆంజనేయుడు పరమభక్తుడు. ఏ అవతారంలోనైనా తన భక్తులను మర్చిపోలేదని చెప్పేందుకే కలియుగంలో వేంకటేశ్వరుడు హనుమంత వాహనంపై విహరించారన్నది భక్తుల విశ్వాసం. దేవదేవుడైన వెంకన్న కూడా భక్తులపై ఎల్లప్పుడూ కృపాకటాక్షాలు ఉంటాయనేందుకు నిదర్శనం ఉత్సవం ఊరేగింపు. ఈ సేవలోనూ లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి దివ్య అనుగ్రహాన్నిచూసి తరించారు.

భక్తునికి, భగవంతునికి కృపాకటాక్షాలుంటాయని చెప్పే దేవదేవుడు ఇవాళ హనుమంతవాహనంపై తిరుమల తిరు వీధుల్లో విహరించారు. యుగాలు మారినా, తరాలు మారినా ప్రియమైన తన భక్తులు మాత్రం ఎపుడూ తన వెంటే ఉంటారని చాటి చెబుతూ భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దేవునిగా ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు దర్శనమిచ్చాడు.

మలయప్ప స్వామిని ఈ సేవలో చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముందు రోజు జరిగిన గరుడ సేవకు వచ్చిన భక్తులు తిరుమలలోనే ఉండిపోవడంతో వీరంతా హనుమంత వాహన సేవను కూడా తిలకించారు.
File
FILE

వెబ్దునియా పై చదవండి