బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పరణ జరిగింది. విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగాడు. భక్తులు బ్రహ్మోత్సవాలలో తిరుమల శ్రీనివాసుని వైభవాన్ని దర్శించుకునేందుకు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను కళ్లారా చూసినంతటనే సమస్త పాపాలు తొలగిపోతాయి. ధనధాన్య సమృద్ధితో సుఖసంతోషాలతో ఉంటారట.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుంటే పరాంతకాలం వరకు ఎలాంటి జనన, మరణ వికారాలు లేకుండా సర్వలోకాలలో విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకుంటారని పురాణాలు చెపుతున్నాయి.
అందుకే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వరాలను, శ్రీవారి ఆశీస్సులను పొందాలని తిరుమల, తిరుపతి దేవస్థానం భక్తకోటికి పిలుపునిస్తోంది. బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో మీకోసం...