ముత్యపు పందిరి వాహనంపై విహరించిన దేవదేవుడు!

దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు. అత్యంత భక్త సులభుడుగా, కోరిన వారికి కొంగుబంగారమై కోర్కెలు తీర్చే శ్రీనివాసునిగా కీర్తింపబడుతున్నాడు. ఆయన బ్రహ్మోత్సవాలు 'న భూతో న భవిష్యత్' అన్న తీరుగా ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. సమస్త బ్రహ్మాండానికీ నాయకుడైన శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులకు కన్నుల పండువగా దర్శన భాగ్యం కల్పిస్తుంటారు.

ఈ బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగారు. దీన్నే సుకుమార సేవగా కూడా పిలుస్తారు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి చాటి చెపుతూ ఈ వాహనంపై ఊరేగుతాడు. ఇదే ఈ వాహనం అంతరార్థం. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా భక్తకోటికి దర్శనమిచ్చాడు.

అంతకుముందు మూడో రోజు ఉదయం సింహ వాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటి చెప్పారు.
File
FILE

వెబ్దునియా పై చదవండి