పుట్టినరోజునాడే "ఆర్య" ప్రచారానికి శ్రీకారం

WD
గంగోత్రి, బన్ని, ఆర్య, దేశముదురు, పరుగు సినిమాల ద్వారా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో అల్లు అర్జున్. ఈ కథానాయకుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనువడు. అలాగే ఇతడు మెగాస్టార్, పద్మభూషణ్ చిరంజీవి మేనల్లుడు. ఈ క్యూట్ హీరోకు ఈ నెల 8వ తేదీ (బుధవారం) పుట్టినరోజు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో వేడెక్కుతోన్న ఎన్నికల హడావుడిలో అల్లు అర్జున్ కూడా ప్రచార అస్త్రాన్ని చేపట్టనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్ తరపున అనకాపల్లిలో ప్రచారం చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో యూత్ సినిమా నటులు క్రియాశీలక పాత్ర పోషించడంతో అల్లు అర్జున్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించారు.

సినిమా పరంగా చూసుకుంటే.. తాజాగా "ఛత్రపతి" నిర్మాత ప్రసాద్ నిర్మిస్తోన్న "ఆర్య-2"లో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొద్దిరోజులు షూటింగ్‌కు విరామం తీసుకున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో దానయ్య నిర్మించే కొత్త చిత్రంలోనూ బన్ని నటిస్తున్నారు.

నటునిగా చిరంజీవి "విజేత" చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన అల్లు అర్జున్ ఆ తర్వాత "డాడీ" చిత్రంలో డాన్సర్‌గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా "గంగోత్రి"తో కెరీర్ ప్రారంభించాడు. "ఆర్య" సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు "దేశముదురు" చిత్రం కూడా క్రేజ్ తెచ్చింది. ఒకవైపు షూటింగ్‌లతో పాటు, మరోవైపు "7అప్" కూల్‌డ్రింక్ అంబాసిడర్‌గానూ ఉన్న అల్లు అర్జున్ ఈ ఏడాది అభిమానులకు దగ్గరగా పుట్టినరోజులో పాల్గొనడం ఆనందంగా ఉందని అల్లు అర్జున్ అంటున్నారు.

పుట్టినరోజు.. ఏప్రిల్ 8 1983,
ఇతర పేర్లు.. బన్ని, ఆర్య.

వెబ్దునియా పై చదవండి