శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ నోట్లు - పాకిస్థాన్ డబ్బు కూడా..

శుక్రవారం, 16 జులై 2021 (11:33 IST)
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దైవ దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. వీరంతా తమ ఇష్టదైవానికి తమకు తోచిన విధంగా కానుకలు సమర్పించుకుంటుంటారు. ఈ క్రమంలో శ్రీవారి హుండీకి దేశ విదేశాలకు చెందిన కరెన్సీ వచ్చి చేరుకుంది. 
 
విదేశీ భక్తులు వారి కరెన్సీని హుండీలో వేస్తున్నారు. ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉండగా శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. విదేశీ కరెన్సీ విషయానికి వస్తే మలేషియా కరెన్సీ నోట్లు అత్యధికంగా 46 శాతం వచ్చాయి. మలేషియా కరెన్సీ తర్వాతి స్థానంలో అమెరికా డాలర్లు ఉన్నాయి. శ్రీవారి హుండీలో అమెరికా డాలర్లు 16 శాతం వచ్చాయి. 
 
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే స్వామి వారికి వచ్చిన విదేశీ కరెన్సీలో పాకిస్థాన్ నోట్లు కూడా ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలో శ్రీవారికి రూ. 27.49 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఈ ఏడాది వీదేశీ నోట్లు తగ్గే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు