26/11 ఉగ్ర దాడి: ట్రెండింగ్ అవుతున్న కసబ్, అతడి ఫోన్ ఏమైంది?

శుక్రవారం, 26 నవంబరు 2021 (13:00 IST)
2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు, కాల్పులతో ముంబైలో మారణహోమం సృష్టించారు. ముంబై మహానగరం దాదాపు 60 గంటలపాటు బందీగా మారింది. ఈ ఉగ్రదాడి జరిగి 13 ఏళ్లు గడుస్తున్నా ప్రజలు దానిని మరిచిపోలేకపోతున్నారు. 26 నవంబర్ 2021 నాటికి 13 సంవత్సరాలు. నేటికీ సోషల్ మీడియాలో అజ్మల్ కసబ్ ట్రెండ్ అవుతున్నాడు. అజ్మల్ కసబ్ ఫోన్ ఏమైందని ప్రజలు అడుగుతున్నారు. దీంతో ఈ ఫోన్ మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

 
ముంబై దాడి తర్వాత సజీవంగా అరెస్టయిన కసబ్ మొబైల్ ఫోన్ మిస్ అయిందని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ పైన ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసు రిటైర్డ్ అధికారి పరంబీర్ సింగ్‌పై కూడా ఆరోపణ చేశారు. 
26/11 ఉగ్రవాద దాడి సమయంలో అజ్మల్ అమీర్ కసబ్ ఫోన్‌ను అప్పటి డిఐజి ఎటిఎస్ పరమ్ బీర్ సింగ్ స్వాధీనం చేసుకున్నారని రిటైర్డ్ ముంబై పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షంషేర్ ఖాన్ పఠాన్ చెప్పారు. ఈ ఫోన్ ఎప్పుడూ టెస్టింగ్ కోసం పంపబడలేదంటూ సంచలన ఆరోపణలు చేసారు.

 
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 150 మందికి పైగా మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులందరినీ మన వీర భద్రతా సిబ్బంది హతమార్చారు, అలాగే అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు.

 
ఈ దాడిలో స్వదేశీ, విదేశీ పౌరులతో పాటు జాయింట్ పోలీస్ కమిషనర్ హేమంత్ కర్కరే, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, ఇన్‌స్పెక్టర్ విజయ్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, హవల్దార్ గజేంద్ర సింగ్, ఏఎస్‌ఐ తుకారాం ఓంబ్లే, ఎందరో ధైర్యవంతులు ప్రాణాలు అర్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు