ఆరేళ్ల బాలికతో నెల్లూరులో ఎలాంటి చాకిరీ చేయిస్తున్నారో చూడండి-video

సోమవారం, 18 మే 2020 (23:07 IST)
మైనర్ బాలబాలికలతో పనులు చేయించరాదని చట్టం వున్నప్పటికీ దాన్ని చాలామంది తుంగలో తొక్కేస్తున్నారు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్- నెల్లూరులోని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పాట్ మూల్యాంకన కేంద్రంలో జరగింది. 6 సంవత్సరాల వయస్సు గల బాలికతో కేంద్రం గదిని శుభ్రం చేయించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ అయ్యింది.
 
ఆ బాలిక కాపలాదారు కుమార్తె. గది శుభ్రం చేయాలని కోరడంతో అభంశుభం తెలియని ఆ బాలిక పని మొదలుపెట్టింది. ఇదంతా అక్కడే వున్న ఓ కానిస్టేబుల్ చూస్తూనే వున్నాడు. ఈ వీడియోను చూసి రష్మి గౌతమ్ స్పందించింది. చిన్న పిల్లలతో పనులు చేయించడం అమానుషం. ఇలాంటి ఘటనలు ఖండించాలి అంటూ ట్వీట్ చేసింది.

This is not normal and shud not be considered normal
pls raise your voice if you see such a thing happening #saynotochildlabour https://t.co/PilM0YHf3e

— rashmi gautam (@rashmigautam27) May 18, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు