తిరుమల శ్రీవారికి భారీ కానుక, ఐదున్నర కిలలో బంగారంతో తయారు చేయించి...

శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:13 IST)
ఆపదమొక్కులవాడా.. అనాధరక్షకా గోవిందా.. గోవిందా అంటూ ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్సనార్థం వస్తుంటారు. శ్రీవారిని దర్సించుకుని మ్రొక్కులు సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత సహాయం వారు చేస్తుంటారు. 

 
ఆపద మ్రొక్కుల స్వామికి కానుకలకు కొదవా అంటూ చెబుతూ ఉంటారు కూడా. ప్రతిరోజు కోట్ల రూపాయల హుండీ ఆదాయంతో పాటు ఆభరణాలను కనుకగా భక్తులు అందిస్తూ ఉంటారు. కరోనా తరువాత మొట్టమొదటిసారి భారీ కానుక తిరుమల శ్రీవారికి అందింది.

 
అది కూడా ఒక అజ్ఞాత భక్తుడు ఈ కానుకను సమర్పించుకున్నాడు. 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే 5.5 కిలోల స్వర్ణ కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామి వారికి కానుకగా అందించారు. స్వర్ణ కటి, వరద హస్తాలను మూలమూర్తికి ఆలయ అర్చకులు అలంకరించనున్నారు. అయితే పేరు, వివరాలను చెప్పడానికి మాత్రం ఆ భక్తులు ఒప్పుకోవడం లేదు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు