పెళ్లి కానుకగా రోడ్డు ... పెళ్లి కుమారుడి ఉదారత

సోమవారం, 15 నవంబరు 2021 (22:32 IST)
సాధారణంగా పెళ్లి కార్యక్రమం అంటే... బంధువులు, స్నేహితులను పిలుస్తారు. వాహనాలను సమకూరుస్తారు.

వసతి, విందు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పెళ్లి కుమారుడు.. రోడ్డు వేయించాడు. పెళ్లికి వచ్చేవారు గతుకుల రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా రూ.2 లక్షలు సొంత సొమ్ముతో మరమ్మతులు చేయించాడు.

నరసాపురం మెయిన్ రోడ్డు నుంచి కొత్త నవరసపురం వరకు కిలోమీటరు మేర రహదారి రెండేళ్లుగా అధ్వానంగా తయారైంది. పెద్ద గోతులు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన చిందాడి హర్షకుమార్ రూ.2 లక్షలు వెచ్చించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు.

గోతులు పడినచోట్ల కంకర వేసి శనివారం జేసీబీతో చదును చేయించారు. "రోడ్డుకు మరమ్మతులు చేయించాలని చాలామంది నాయకులకు విన్నవించాం. ఎవరూ పట్టించుకోలేదు. నా పెళ్లికి వచ్చే బంధువులు ఎవరూ ఇబ్బంది పడకూడదని రోడ్డు వేయించా. ఇది నా పెళ్లికి గుర్తుగా ఉంటుంది" అని హర్షకుమార్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు