సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

ఐవీఆర్

సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (20:58 IST)
కర్టెసి-ట్విట్టర్
మనిషన్నాక కూసింత కళాపోషణ వుండాల అనేది సినిమా డైలాగ్. అంటే... ఎంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా... ఇంకా తీరక లేని పనులు చేస్తున్నా కూడా జీవితంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులుతో కలిసి అప్పుడప్పుడు ప్రకృతి అందాల మధ్య సంతోషంగా కొంత సమయాన్ని గడపాలి. పాపం... ప్రస్తుతం చాలామంది మనుషులకు మాత్రం ఇది సాధ్యం కావడంలేదు. కానీ జంతువులు మాత్రం కాస్తో కూస్తో ఎంజాయ్ చేస్తున్నాయ్. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఓ కుక్కపిల్ల తనతో పాటు బాతుపిల్లను వెంటేసుకుని తెగ చక్కెర్లు కొట్టేస్తుంది. బాతుపిల్ల కిందపడిపోతుంటే పైకి లేపుతుంది. పరుగెత్తలేకపోతే నోటితో పట్టుకుని తనతో తీసుకెళ్తోంది. సాయంత్రం సూర్యాస్తమయాన్ని పక్కనే కూర్చోబెట్టుకుని అలా చూస్తోంది. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి.

They are very cute.

Even animals can make friends across their kind. pic.twitter.com/7QQ0HEVQCt

— The Figen (@TheFigen_) January 26, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు