డెలివరీ బాయ్‌‌కి చెంపదెబ్బలు.. పోలీస్ అరెస్ట్.. వీడియో వైరల్

సోమవారం, 6 జూన్ 2022 (16:07 IST)
Traffic police
కోవై ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌ను చెంపదెబ్బలు కొట్టినందుకు ఓ పోలీస్ అరెస్ట్ కావడంతో పాటు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల బాధితుడు మోహన్ సుందరం రెండేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.
 
రోజూలాగే తన విధుల్లో భాగంగా అవినాశి రోడ్డులో శుక్రవారం బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ సమయంలో ఓ స్కూల్ వ్యాన్ వేగంగా వచ్చి వచ్చింది. 
 
రెండు వాహనాలను, పాదచారులను ఢీకొట్టి వెళ్లింది. దీనిని గమనించిన మోహన్ సుందరం ఆ వ్యాన్ ఆపేందుకు ప్రయత్నించాడు. చివరికి దానిని ఆపాడు. అయితే ఈ క్రమంలో అవినాశి రోడ్డు జంక్షన్ లో స్పల్ప ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
 
దీంతో అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సింగనల్లూర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ట్రాఫిక్ జామ్ కారణమైన ఫుడ్ డెలివరీ బాయ్‌ను చెంప దెబ్బలు కొట్టాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. 
 
ఫుడ్ డెలివరీ బాయ్‌ను కానిస్టేబుల్ కొడుతున్న దృశ్యాలన్నీ దాంట్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో విడుదల కావడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. అందరూ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పట్ల సానుభూతి ప్రకటించారు.
 
నెటిజన్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఇదే సమయంలో బాధితుడైన మోహన సుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్ సతీష్‌‌పై కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడిని విధుల నుంచి తొలగించి, అరెస్టు చేశారు.  

Video | A traffic police constable was transferred to the #Coimbatore city police control room on Saturday after video of him slapping a food delivery agent went viral on social media.

Read more herehttps://t.co/mYbpkPp0yf pic.twitter.com/8RvijBHpNL

— TOI Coimbatore (@TOI_Coimbatore) June 5, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు