రోడ్డుపై అడ్డంగా బండి నడిపిన యువతి.. ఓవరాక్షన్.. అంతా ట్రెండ్ కావాలనా? (video)

సెల్వి

శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:13 IST)
Young woman
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువతి రోడ్డుపై హంగామా సృష్టించిన వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. మహిళలకు సంబంధించిన అకృత్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. ఓ యువతి ట్రెండ్ కావాలని ఇలా చేసిందో లేకుంటే అదే పనిగా రోడ్డుపై అందరి దృష్టిని ఆకర్షించాలని ఇలా చేసిందో తెలియదు కానీ.. టూవీలర్‌పై వచ్చిన యువతి చేసిన ఓవరాక్షన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై టూవీలర్‌లో వచ్చిన యువతి రాష్ డ్రైవింగ్ చేసింది. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. ఈ క్రమంలో బండిని నడుపుతూ కిందపడింది. ఇంకా అడ్డుగా వచ్చినందుకు ఓ టూవీలరిస్టుపై వాగ్వాదానికి దిగింది. 
 
బండి తాళాన్ని తీసుకుని తాను కరెక్టుగా వచ్చినట్లు జగడానికి దిగింది. ఈ యువతి చేసిన చర్యకు కాసేపు రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇంకా టూవీలరిస్టును బెదిరించింది.

?????????
pic.twitter.com/OCctA3OLAx

— Ghar Ke Kalesh (@gharkekalesh) September 5, 2024
 
యువతి చేసిన ఓవరాక్షన్‌కు కొంతమంది ఆమెకు మద్దతు పలికినా.. టూవీలరిస్టు మాత్రం ఆ యువతిని చెడామడా తిట్టేశాడు. చేసింది తప్పని నిలదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు