బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సతీశ్ షా జాతివివక్షను ఎదుర్కొన్నారు. లండన్‌లోని హిత్రూ విమానాశ్రయంలో ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది. కానీ, ఆయన ఎదుర్కొన్న తీరును, రేసిస్ట్ అధికారికి ఆయన చెప్పిన సమాధానంపై నెటిజన్లు అద్భుతం, శభాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై బాలీవుడ్ నటుడు ఓ ట్వీట్ చేశారు.
కాగా, షా ట్వీట్‌కు విపరీతమైన స్పందన లభించింది. సతీశ్ షాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వేలల్లో లైకులు వచ్చాయి. ఈ విషయం హిత్రూ విమానాశ్రయ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు స్పందించి, సతీశ్ షాకు క్షమాపణలు చెప్పారు.