చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్ అంటూ సైనాపై నటుడు సిద్ధార్థ్ అభ్యంతరకర ట్వీట్

మంగళవారం, 11 జనవరి 2022 (10:40 IST)
నటుడు సిద్ధార్థ్‌కి రాంగోపాల్ వర్మకి కాస్త దగ్గర పోలికలున్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమాలతో బిజీగా లేకున్నప్పటికీ అటు వర్మ ఇటు సిద్ధార్థ్ ఎప్పుడూ బిజీగా వుంటారని ఎద్దేవా చేస్తున్నారు. వర్మ సంగతి మనకి తెలిసిందే. ఇంతకీ సిద్ధార్థ్ ఏం చేసాడు?

 
సైనా నెహ్వాల్ పైన ట్విట్టర్లో పెట్టిన ఓ కామెంట్ నటుడు సిద్ధార్థ్‌ను విమర్శలపాలు చేసింది. ఈమధ్యనే ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపైన సైనా స్పందించారు. దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇక ఆ దేశం భద్రంగా వుందని ఎలా భావించగలం.... ఇది అరచకవాదుల పిరికిపంద చర్య అంటూ ట్వీట్ చేసారు సైనా.

 
దీనిపై సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ.... చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్, దేవుడా ధన్యవాదాలు, భారతదేశాన్ని కాపడటానికి కొందరు రక్షకులున్నారంటూ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. సిద్ధార్థ్ ట్విట్టర్ పేజీని బ్లాక్ చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

 
మరోవైపు ఈ వ్యవహారం ముదరడంతో ఎన్.సి.డబ్ల్యు సుమోటోగా స్వీకరించింది. కాగా సిద్ధార్థ్ అతడి కామెంట్ పైన వివరణ ఇస్తూ... తన ఉద్దేశ్యం వేరే అని పేర్కొన్నాడు. కాక్ అండ్ బుల్ అనే పదాలను దృష్టిలో పెట్టుకుని చేసాననీ, దాన్ని మరోలా అన్వయించుకోవద్దనీ, తన మాటలు అగౌరవపరిచేవి కాదంటూ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు