కరోనా వైరస్‌ విముక్త ప్రాంతంగా ఈశాన్య భారత్?!

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (18:54 IST)
దేశాన్ని కరోనా వైరస్ చుట్టేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ముఖ్యంగా వైరస్ బారినపడి అనేక చనిపోతున్నారు. ఈ వైరస్ అడ్డుకట్టకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన రాష్ట్రాల్లో ఈశాన్య భారతంలోని ఎనిమిది ఉన్నాయి. ఇందులో ఐదు రాష్ట్రాలు కరోనా విముక్త రాష్ట్రాలుగా పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాలైన సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. 
 
ఇదే అంశంపై జితేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈశాన్యంలోని అస్సోం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఇకా కరోనా నుంచి విముక్తి కావడం లేదని తెలిపారు. అయినప్పటికీ, ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త కేసులేవీ నమోదు కావడం లేదని చెప్పారు. 
 
గత ఆరేళ్లుగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందునే ఆ రాష్ట్రాల్లో తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయని, ఆ క్రెడిట్ మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 
 
దేశంలో కరోనా వైరస్ కేసు నమోదైన తర్వాత కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుందని చెప్పారు. ముఖ్యంగా, మార్చి 30వ తేదీ నుంచి ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ద్వారా నిత్యావసరాలు నిరంతరాయంగా ఈశాన్య ప్రాంతాలకు అందుతున్నాయని తెలిపారు. 
 
ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్, దేశంలోని పర్వత ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాయన్నారు. అలాగే, షిల్లాంగ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈశాన్య అభివృద్ధి మండలి అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తోందని మంత్రి ప్రశంసించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు