ఇక గువాన్యిన్క్వియాలో ఏర్పాటు చేసిన స్క్రీన్లలో ప్రదర్శించిన ఫ్లయింగ్ సాసర్ 3డీ వీడియోలు సైతం అబ్బురపరుస్తున్నాయి. రైలు, విమానాలు ఇలా ఆ డిస్ప్లేల్లో కనిపించే ప్రతి ఒక్కటి తమ మధ్యలోకి వస్తున్నాయేమో అన్నట్టు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా కళ్లకు ఎలాంటి ప్రత్యేకమైన అద్దాలు లేకుండా ఈ త్రీడీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుండడం ప్రత్యేకత. ఇలాగే 2020లో సౌత్ కొరియాలో ఏర్పాటు చేసిన ఓ 3డీ డిస్ప్లే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.