అన్నకు మంచి పదవి కోసం తమ్ముడి ఆరాటం..?

శనివారం, 9 జనవరి 2021 (21:48 IST)
అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకరు ఎంపి.. మరొకరు ఎమ్మెల్యేగా. అయితే ఇద్దరూ ఓడిపోయారు. అన్న ఓడిపోయిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ తమ్ముడు మాత్రం రాజకీయాల్లోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది...వారెవరో.
 
ఒకరు నాగబాబు.. మరొకరు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరూ ఓడిపోయారు. ఆ తరువాత నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు జనసేనాని. కానీ నాగబాబు మాత్రం టీవీ షోలకే పరిమితమయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
 
కానీ ముందు నుంచి నాగబాబుకు రాజకీయాలంటే ఇష్టం. అందుకే పవన్ కళ్యాణ్‌ ఈసారి అన్న నాగబాబుకు మంచి పదవి తీసివ్వాలి.. మంచి పేరు తెచ్చుకునే విధంగా చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే బిజెపి పెద్దలతో చర్చలు కూడా జరిపారట పవన్ కళ్యాణ్.
 
సంప్రదింపుల తరువాత త్వరలో బిజెపిలో జాతీయ స్థాయిలో పార్టీ పదవిని అప్పజెప్పమని అడగబోతున్నారట. రాష్ట్రస్థాయిలో ఉన్న జనసేన కన్నా జాతీయస్థాయిలో ఉన్న బిజెపి అయితే బాగుంటుందన్న భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. ఎప్పుడూ తాము ఏది చెబితే అది వినే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కోరిన ఒకే ఒక్క కోరిక అన్నకు పదవి.. ఆ పదవి ఇచ్చేద్దామని బిజెపి పెద్దలు కూడా నిర్ణయించేసుకున్నారట. మరి చూడాలి నాగబాబుకు ఎలాంటి పదవి ఇస్తారన్నది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు