హిందూస్థాన్ టైమ్స్ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, 'భారతీయుడు ఎవరైనా అమెరికా, బ్రిటన్, రష్యాలో అక్రమంగా నివసించగలరా?.. సాధ్యం కాదు. అలాంటప్పుడు చొరబాటుదారులు భారత్‌లో అక్రమంగా నివసించడాన్ని చూస్తూ ఎందుకు కూర్చోవాలి. అందుకే ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం' అని ఆయన స్పష్టం చేశారు.
దేశ భద్రత దృష్ట్యా ఎన్నార్సీ అమలు తప్పనిసరని చెప్పారు. చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడుతామన్నారు. హిందు, సిక్కు, జైన, బౌద్ధ శరణార్థులకు భారత పౌరసత్వం ఇస్తామని, ఇందుకోసం చట్టం తీసుకొస్తామన్నారు. ఎన్నార్సీ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రజలను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.