పార్టీ సిద్ధాంతాల కంటే... దేశ హితం ముఖ్యం : కేఈ కృష్ణమూర్తి

సోమవారం, 5 నవంబరు 2018 (17:12 IST)
పార్టీ సిద్ధాంతాల కంటే దేశ హితం ముఖ్యమని, అందుకే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాల్సి వచ్చిందని ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ టీడీపీ అనడంలో సందేహం లేదని... కానీ, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమా? లేక దేశ శ్రేయస్సు ముఖ్యమా? అని అడిగితే... దేశ శ్రేయస్సుకే తాను ఓటు వేస్తానని తెలిపారు.
 
మిత్రులుగా భావించిన వారు శత్రువులుగా మారినప్పుడు... శత్రువులు మిత్రులుగా మారడంలో తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కన్నా భారతీయ జనతా పార్టీనే దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. దేశంలోని కీలక వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ధీటుగా ఎదుర్కోవడానికే జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకానుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విభిన్నమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు