గదికి వస్తావా లేదా ఫెయిల్ చేయమంటావా? ఢిల్లీ ప్రొఫెసర్ల వేధింపులు...

సోమవారం, 6 ఆగస్టు 2018 (11:14 IST)
దేశంలో అత్యన్నత విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) ఒకటి. ఇందులో సీటు రావడమంటే అంత ఆషామాషీకాదు. అప్పటికీ ఈ వర్శిటీలో సీట్లు సంపాదించే మెరిట్ విద్యార్థినిలకు కూడా లైంగిక వేధింపులకు తప్పడం లేదు. తమకు పడక సుఖం అందిస్తేనే పాస్ చేస్తామని లేనిపక్షంలో ఫెయిల్ చేస్తామంటూ ఏకంగా ప్రొఫెసర్లే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
 
తాజాగా ఓ యవతి తనపై ప్రొఫెసర్‌ వేధింపులకు పాల్పడున్నారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కాఫీకి రాకపోతే పరీక్షల్లో ఫెయిల్‌ చేసి, హాజరుశాతం తగిస్తానంటూ వేధిస్తున్నారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఢిల్లీ ప్రొఫెసర్ల వ్యవహారశైలి మరోమారు వివాదాస్పదమైంది. 
 
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేందుకు అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీలో ముగ్గురు అధ్యాపకులు, ఓ మహిళ ఫ్రొఫెసర్‌, ముగ్గురు విద్యార్థులు ఉండాలనేది నిబంధన. 
 
కానీ అధికారులు అవేవీ పట్టించుకోవట్లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో కూడా అనేక యూనివర్సిటీల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 
 
కాగా, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థినిలకు వేధింపులు తప్పడం లేదు. గడిచిన నాలుగేళ్లలో డీయూలో 28 లైంగిక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. ఈ కేసులన్నీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లపై నమోదు కావడం గమన్హారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు