విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన వద్ద చదువుకునే 4, 5 తరగతులకు చెందిన విద్యార్థినిలకు లైంగిక వేధింపులతో చుక్కలు చూపించారు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థినిలు తమ గోడును తల్లిదండ్రుల వద్ద వెళ్లబోసుకున్నారు. దీంతో వారంతా పట్టుకుని దేహశుద్ధి చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇక వీడితో వేగలేమని భావించిన విద్యార్ధినిలు విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో బాలికల తల్లిదండ్రులు ఆయన్ను పట్టుకుని చితకబాది ఆ తర్వాత బాలాయపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక టీచర్‌పై కేసు నమోదు చేశారు. బాలాయపల్లి ఎమ్మార్వో స్కూల్ వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు.