ఎపుడైనా మరో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం : పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్

సోమవారం, 24 సెప్టెంబరు 2018 (16:47 IST)
పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరోమారు హెచ్చరిక చేశారు. పాకిస్థాన్ సైన్యంతో పాటు నిఘా సంస్థ ఐఎస్ఐను అదుపులో ఉంచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే మరోమారు సర్జికల్ స్ట్రైక్‌కు వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సరిహద్దుల్లో భారత సైనికులతో పోరాడలేక అన్యాయంగా పోలీస్ ఆఫీసర్లను ఎత్తుకెళ్తూ వారిని దారుణంగా చంపుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సైన్యాన్ని, ఐఎస్‌ఐను ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం అదుపులో పెట్టుకోవాలని లేకపోతే మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పవని ఆయన హెచ్చరించారు. 
 
అయితే గత గురువారం ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ఒక కానిస్టేబుల్‌ను అపహరించిన పాక్ ఉగ్రవాదులు వారిని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అంతకుముందు సరిహద్దుల్లో కూడా ఓ జవాన్‌ను ఉగ్రమూక చంపింది. దీంతో న్యూయార్క్‌లో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి షా మెహమూద్ ఖురేషి, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్య జరగాల్సిన సమావేశాన్ని భారత్ రద్దు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు