చైనాకు చెందిన ప్రముఖ యాప్స్ పైన కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నెటిజన్లు కొంతమంది తమదైన శైలిలో సెటైర్లు పేల్చుతూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. అది కూడా #RIPTikTok అంటూ హ్యాష్ టాగ్ జత చేసి పోస్ట్ చేస్తుండటంతో అది కాస్తా ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యింది. ఓ నెటిజన్ పోస్టు చేసిన ఈ వీడియో చూడండి.
ఏ తప్పూ చయలేదు... ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు : టిక్ టాక్ ఇండియా
భారత సార్వభౌమత్వానికి, గోప్యతకు విఘాతంగా మారాయన్న కారణంతో టిక్ టాక్, షేరిట్ వంటి అత్యంత పాప్యులర్ యాప్స్ సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. దీనిపై టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ స్పందించారు. తాము ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరుగలేదని స్పష్టం చేశారు.
"భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. భారత యూజర్లకు చెందిన సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోలేదు" అని ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని, తమ అభ్యంతరాలను తెలియజేస్తామని, ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేస్తామని ఆయన అన్నారు.