అయితే వర్ధమాన నటి శరీర భాగాలపై ఉన్న గాయాలు కల్పితమేనని వైద్య నివేదికలో తేలడంతో పాటు.. రాంకుమార్, వర్ధమాన నటి పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారని న్యాయస్థానం నిర్ధారించింది. దీంతో కేసును కోర్టు కొట్టేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను ఆయన ఇంటికి వెళ్లానని, సినిమాలో తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదు చేసేదాన్ని కాదని డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో బాధితురాలు స్పష్టం చేయడంతో.. కోర్టు కేసును కొట్టేసింది.