సాయిబాబా ఆలయంలో 3,700 కిలోల కిచ్డీ తయారీ.. గిన్నిస్ రికార్డ్ ఖాయమా?

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:28 IST)
Kichidi
భోపాల్‌లోని అవధ్‌పురి సాయిబాబా ఆలయానికి చెందిన బృందం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించే ప్రయత్నంలో 3,700 కిలోల భారీ కిచ్డీని తయారు చేసింది. 400 కిలోల కూరగాయలు, 350 కిలోల బియ్యం, 60 కిలోల పప్పులతో తయారు చేసిన వంటకాన్ని తయారు చేయడానికి సదరు బృందం ఆరు గంటల పాటు శ్రమించింది. 
 
కిచిడీ తయారు చేసిన అనంతరం ఆలయానికి తరలివచ్చిన 15 వేల మంది భక్తులకు ఈ కిచ్డీని పంచిపెట్టారు. తయారీ నుండి పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ రికార్డ్ చేయబడింది. ధృవీకరణ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందానికి పంపబడుతుందని నిర్వాహకులు తెలిపారు. 
 
ప్రసాదం తయారీకి దాదాపు రూ. 5 లక్షలు ఖర్చవుతుందని, నిపుణుల బృందంతో వంట నాణ్యతను పరిశీలించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వీరి సృజన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటుందని ఆలయ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు