ఆ తర్వాత వీరిరువురూ ఒకేచోట చేరి బాతాకానీలు కొట్టడం, ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం వంటివన్నీ జరుగుతోంది. మిగిలిన సభ్యులంతా తలోదగ్గర వుంటే వీరు మాత్రం ముద్దులు, హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులతో హౌసులో ఓ స్థాయి చర్చకు తీసుకెళ్లారు. ఐతే మంగళవారం నాటి ఎపిసోడ్లో వితిక-పునర్నవి ఇద్దరూ ఏదో విషయంపై డిస్కషన్ చేస్కుంటుంటే... మధ్యలో వరుణ్ సందేశ్ జోక్యం చేసుకుని తన భార్యకు వ్యతిరేకంగా మాట్లాడాడు.
ఆ మాటలకు ఆమె చిన్నబుచ్చుకుని ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది. దీంతో మిగిలిన సభ్యులు ఆమెను ఓదార్చారు. చివరికి వరుణ్ సందేశ్ కూడా సారీ చెప్పాడు. కానీ నెటిజన్లు మాత్రం వదలడంలేదు. హల్లో బిగ్ బాస్... వరుణ్ భార్యను బయటకు పంపేయండి.. లేదంటే వాళ్లు హౌసులోనే విడిపోయేట్లున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు ఇంకా పడుతూనే వున్నాయి.