కానీ అది ఎంతమాత్రం చెక్కుచెదరలేదని ఇస్రో గుర్తించింది. ల్యాండర్ బరువు ప్రజ్ఙాన్ రోవర్‌తో కలిపి 1471 కిలోలు. పడిపోతే పగిలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న కారణంగా మంచి కబురునే మోసకొచ్చింది. అది ఎంత ఎత్తు నుంచి పడిపోయినా ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా పడిన చోటే స్థిరంగా ఉన్నట్లు గుర్తించారు.
పాజిటివ్ అంశాలు ఉండటంతో ల్యాండర్ నుంచి సిగ్నల్స్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ లోపల ప్రజ్ఙాన్ రోవర్ కూడా ఉంది. ఇస్రో చెబుతున్న ప్రకారం ల్యాండర్ క్షేమంగా ఉండటంతో సిగ్నల్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయట. ఒక్కసారి సిగ్నల్స్ అందితే దానికి కావాల్సిన విధంగా సెట్ చేసుకోవడానికి వీలు ఉంటుందట. అంతేకాదు అందులో నుంచి రోవర్‌ను కూడా బయటకు తీసుకురావచ్చట.
ల్యాండర్ కాలపరిమితి 14 రోజులు. ఇంకా 12 రోజులే సమయం మిగిలి ఉండడంతో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆర్బిటర్, ల్యాండర్ల మధ్య సమాచార వ్యవస్థను పునరుద్ధరించి, అలాగే విక్రమ్ వ్యవస్థను పునరుద్దరించేలా చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో విక్రమ్ ల్యాండర్ నుంచి పూర్తిస్థాయిలో సంకేతాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు.