త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అనేక టెక్ కంపెనీలు తమవద్ద పనిచేసే ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. కానీ, చైనాకు చెందిన క్రేన్ తయారీ సంస్థ మాత్రం ఏకంగా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ఆ బోనస్ కూడా వందల్లో వేలల్లో కాదు.. ఏకంగా కోట్లలో ఉండటం ప్రతి ఒక్కరూ నోరు వెళ్లబెట్టేలా చేసింది.
చైనాకు చెందిన హెనాన్ మైన్ అనే కంపెనీ క్రేన్ల తయారు చేస్తుంది. గత యేడాది కరోనా కారణంగా పలు కంపెనీలు ఆర్థికంగా తీవ్రమైన నష్టాలను చవిచూశాయి. కానీ, హెనాన్ మైన్ సంస్థకు మాత్రం భారీ లాభాలను అర్జించింది. దీంతో కంపెనీ లాభాలకు కారణమైన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.
మరో ముగ్గరు ఉద్యోగులకు రూ.6 కోట్లు, మిగిలిన ఒక్కొక్కరికీ ఒక మిలియన్ యువాన్లు (రూ.1.20 కోట్లు) బోనస్‌గా ఇచ్చింది. దీంతో కంపెనీ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న వీడియోలను చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.