నవపాషాణలింగం అభిషేకం నీళ్లు తాగితే కరోనా రాదు: నిత్యానంద

బుధవారం, 9 జూన్ 2021 (16:14 IST)
వివాదాస్పద బాబా నిత్యానంద కరోనా వైరస్ పై వీడియో విడుదల చేశాడు. రానున్న రోజుల్లో భారత్‌లో వైరస్ మరింత విజృంభించి లక్షల మంది ప్రాణాలను హరిస్తుందని కోట్లలో కరోనా బాధితులు వుంటారని చెప్పాడు. దేశం విడిచి పారిపోయిన రాసలీలల నిత్యానంద స్వామి... ప్రస్తుతం కోరలు చాచిన కరోనా దరిచేరకూడదంటే తాను కైలాస సరోవరంలో ప్రతిష్టించిన నవపాషాణలింగం అభిషేకం నీళ్లు తాగితే కరోనా రాదని నిత్యానంద చెబుతున్నాడు.
 
తాను చేసిన నవపాషాణ లింగానికి అంత శక్తి ఉందని పేర్కొన్నాడు.  తనను అగౌరవపరచిన భారతీయులందరూ తప్పులను సరిదిద్దుకోవాలని సూచించాడు. నిత్యానంద ఆనందలింగాన్ని తాకితే కరోనా రాదనే విషయాన్ని త్వరలోనే ప్రపంచానికి నిరూపిస్తానని నిత్యానందస్వామి అన్నాడు.
 
కరోనా వచ్చినవారు, రానివారు ఎవరైనా అభిషేకంలో పాల్గొంటే కరోనా రానేరాదని చెప్తున్నాడు. తనను బహిష్కరించిన.. అవమానించిన భారతీయులను తాను ఎప్పుడూ కాపాడుతుంటానని చెప్పాడు. అంతేకాదు.. తాను హిమాలయాలలో నిత్యానందస్వామి ఆనందరూపంతో దర్శనం ఇచ్చినప్పుడు కరోనాతోపాటు అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుందని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు