రైలు పట్టాలపై సిలిండర్ పెట్టాడు.. అంతే ఎగిరిపడింది కానీ.. పేలలేదు..

ఆదివారం, 11 ఆగస్టు 2019 (12:03 IST)
సోషల్ మీడియాపై యువతకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేయడం కోసం వ్యూస్ కొట్టడం కోసం ఏకంగా ఓ సిలిండర్‌ను మీద పెట్టాడు ఓ ఆకతాయి. దానిపై రైలు వెళ్తే ఎలా వుంటుందో షూట్ చేయాలనుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వేర్పాడుకు చెందిన రామిరెడ్డి అనే యువకుడు గతంలో రైలు పట్టాలపై బాణసంచి, బైకులను పెట్టి రైలు వాటిపై నుండి వెళ్లేప్పుడు ఎలా ఉంటుందో షూట్ చేసి యూట్యూబ్‌లో ఉంచేవాడు. కానీ ఈసారి సిలిండర్‌ను రైలు పట్టాలపై వుంచాడు. దానిపై రైలు వెళ్తే ఎలా ఉంటుందో షూట్ చేయాలనుకున్నాడు.
 
అయితే అదృష్టం బావుండి ఈ ఘటనలో పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. రైలు సిలిండర్ ను ఢీకొట్టడంతో వేగంగా దూరంగా ఎగిరిపడింది కానీ పేలలేదు. హైదరాబాద్‌కు చెందిన నరసింహ అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలను చూసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రామిరెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు