చైనాను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బౌద్ధ మత గురువు దలైలామా ఓ మంత్రాన్ని ఉచ్ఛరించాలని పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించేవారి సంఖ్య వందకు పైగా పెరిగిపోతోంది. అలాగే ఐదువేల మందికి పైగా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఈ వైరస్ ధాటికి జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వైరస్‌కు ఇంకా మందులు కనిపెట్టేందుకు వైద్యులు, పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనీయులు ఓ మంత్రాన్ని ఉచ్ఛరించాలని బుద్ధ మత గురువు దలైలామా తెలిపారు.