ఏ క్ష‌ణమైనా నేను మృత్యువు ఒడిలోకి చేరొచ్చు.. ఐ లవ్ యు అమ్మా...

బుధవారం, 31 అక్టోబరు 2018 (15:27 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు, దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
దూరదర్శన్ టీంలో అచ్యుతానంద సాహుతో పాటు రిపోర్టర్ ధీరజ్ కుమార్, కెమెరా అసిస్టెంట్ మొర్ముక్త్ శర్మ ఉన్నారు. మావోయిస్టులు వీరిని అటాక్ చేసిన టైంలో ధీరజ్, మొర్ముక్త్ శర్మ ఓ గుంతలో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ సమయంలో శర్మ ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. 
 
'మా టీంలోని ముగ్గురం బైక్‌పై వెళ్తుండగా మావోయస్టులు ఫైరింగ్ చేశారు. మాతో ఉన్న పోలీసులు ఎదురుకాల్పులు జరుపుతున్నారు. మృత్యువు మా ముందు ఉంది. ఏ క్ష‌ణమైనా నేను మృత్యువు ఒడిలోకి చేరొచ్చు.. ఐ లవ్ యు అమ్మా.. నువ్వంటే నాకిష్టం.. నువ్వు జాగ్రత్త' అంటూ అక్కడ జరుగుతున్న పరిస్థితిని వీడియో తీశాడు. 

 

As the Police and Doordarshan team came under attack from Naxals, DD assistant cameraman recorded a message for his mother. pic.twitter.com/DwpjsT3klt

— Rahul Pandita (@rahulpandita) October 31, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు