గ్రాండ్ హోటల్ నుంచి ఫిఫ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చచ్చిన బొద్దింక కూడా?

శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:26 IST)
హైదరాబాద్‌లోని ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. కోఠిలోని గ్రాండ్ హోటల్ నుంచి జొమాటో ద్వారా బిర్యానీ ఆర్డర్ చేస్తే.. దాంతోపాటు చచ్చిన బొద్దింకను కూడా కలిపి పంపారు. ఆవురావురుమంటూ తింటున్న ఆ యూజర్‌కు మధ్యలో ఏదో తేడాగా కనిపిస్తే తీరిగ్గా చూసి కంగారుపడ్డాడు. అది చచ్చిన బొద్దింక. వెంటనే తినడాన్ని ముగించి దానిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
 
కోఠిలోని గ్రాండ్ హోటల్ నుంచి జొమాటో ద్వారా ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేశానని.. అందులో చచ్చిన బొద్దింక వున్నదని చెప్పాడు. "ఆ హోటల్  సిబ్బంది నాపై చాలా దయచూపారు. మరింత అదనపు ప్రొటీన్ కోసం చచ్చిన బొద్దింకను కూడా పంపారు. మీరు పురుగులు గట్రా తింటే తప్ప ఇక్కడి నుంచి ఆహారం తెప్పించుకోవద్దు" అని రాసుకొచ్చాడు. ఈ పోస్టుకు నెటిజన్లు విరగబడి కామెంట్లు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు