ఎర్త్ డేను ధరిత్రి దినోత్సవం, భూదినోత్సవంగా పిలుస్తున్నారు. ఈ దినాన్ని 2009 నుంచి ఐక్యరాజ్యసమితి "ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్‌డే"గా మార్చింది. భూమితో మానవాళికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు, ప్రచారంతో ఎర్త్ డేని జరుపుకుంటారు. భూ గ్రహాన్ని రక్షించే చర్యలను ప్రారంభించాల్సిన అవసరాన్నిఈ రోజు గుర్తింపును తెలియజేస్తోంది.