రాపిడో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ డెవలపర్.. అంతా పబ్లిసిటీ స్టంట్

శనివారం, 24 జూన్ 2023 (12:13 IST)
కరోనాతో పాటు ఆర్థిక మాంద్యం కారణం లే ఆఫ్‌లు కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో చాలామంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ జావా డెవలపర్.. ఇప్పుడు ర్యాపిడో డ్రైవర్‌గా మారాడు. ర్యాపిడో డ్రైవర్‌గా మారిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వివరాలను బెంగళూరుకు చెందిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టు పట్ల నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన లవ్‌నీష్ ధీర్ అనే నెటిజన్ ర్యాపిడో యాప్ ద్వారా బైక్ ట్యాక్సీని బుక్ చేసుకున్నాడు. మార్గమధ్యలో తన ర్యాపిడో డ్రైవర్ గతంలో ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసినట్లు తెలుసుకుని షాకయ్యాడు. తన ర్యాపిడో డ్రైవర్ గతంలో హెచ్‌సీఎల్ కంపెనీలో జావా డెవలప్‌గా పనిచేశాడట.
 
కొద్ది నెలల క్రితం ఆర్థిక మాంద్యం భయాలతో ప్రకటించిన లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం కోల్పోయినట్లు తెలిపాడు. అంతేగాకుండా తెలిసిన కంపెనీల్లో ఎక్కడైనా జావా డెవలపర్ ఓపెనింగ్స్ వుంటే తనకు చెప్పండి.. అతని వివరాలను డైరక్టుగా మెసేజ్ చేస్తానని ట్వీట్ చేశాడు. 
 
ఈ ట్వీట్ చూసిన వారు ఇదేదో పబ్లిసిటీ స్టంట్.. కేవలం పాపులారిటీ కోసం ఇలాంటి పోస్టులు పెడుతున్నారని కామెంట్స్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు