వివరాల్లోకి వెళితే.. వరంగల్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి పునాది రాయి వేసి ఆగస్టు పదో తేదీతో 133 ఏళ్లు నిండిన సందర్భంగా తాను నివాసం వుంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి మాట్లాడుతూ.. అప్పట్లో ఈ భవనానికి జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన చేశారని తెలిసిందన్నారు. ఇంతకీ జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తితో పరిశోధన చేయగా.. జార్జ్ పామర్ గొప్ప ఇంజినీర్ అని తెలిసిందన్నారు. అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు.
గతంలో ఈ భవనంలో పనిచేసిన కలెక్టర్లు ఇందులోని మొదటి అంతస్తులో దెయ్యం ఉందని తనతో చెప్పారని ఆమ్రపాలి తెలిపారు. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక ఓ రోజు మొదటి అంతస్తులోకి వెళ్లి చూస్తే.. గదంతా చిందరవందరగా ఉందని, దీంతో అన్నీ నీట్‌గా సర్దిపెట్టించానని పేర్కొన్నారు. అయినా సరే అక్కడ దెయ్యం ఉందన్న భయం తనను వీడలేదని, అందుకే అక్కడ నిద్రపోవడానికి సాహసించడం లేదని ఆమ్రపాలి అన్నారు.