2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 1ని గ్లోబల్ పేరెంట్స్ డేగా ప్రకటించింది. ఈ రోజున, ప్రజలు తమ తల్లిదండ్రులతో సమయం గడపవచ్చు.. వారికి బహుమతులు ఇవ్వవచ్చు లేదా కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
మీ తల్లిదండ్రులతో సమయం గడపడం ద్వారా కుటుంబ బంధాన్ని మరింత పటిష్టం చేయడం జరుగుతుందని యూఎన్ ఉద్ఘాటిస్తుంది. UN అధికారికంగా జూన్ 1ని గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్‌గా గుర్తించినప్పటికీ, దాని మూలాలు 80వ దశకం నాటివి.
కానీ పిల్లల వ్యక్తిత్వం, వికాసానికి తల్లిదండ్రుల ఉనికి చాలా ముఖ్యమైనదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. పిల్లలు ఆనందం, ప్రేమ అవగాహనతో కూడిన వాతావరణంలో పెరగాలని ఇది జోడించింది.
పిల్లల కౌమారదశకు గుర్తింపు, ప్రేమ, సంరక్షణ, సదుపాయం అందించడమే కాకుండా వారికి ఆర్థిక భద్రత, స్థిరత్వాన్ని కూడా తల్లిదండ్రులు అందిస్తారు. అలాంటి వారిని గౌరవించడం.. వారిని గర్వపడేలా చేయడం చాలా ముఖ్యం. పిల్లలు ఉన్నతస్థాయికి ఎదగడం.. వివిధ రంగాల్లో రాణించడం.. సమాజంలో గౌరవాన్ని పొందడం వంటివి తల్లిదండ్రులకు పిల్లలిచ్చే కానుకలు అనేది గుర్తుపెట్టుకోవాలి.