''వినయ విధేయ రామ''తో పోయింది.. ఎన్నికల యాడ్స్ ద్వారా వచ్చింది..?

గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:50 IST)
వినయ విధేయ రామ సినిమాతో నష్టాల్లో కూరుకుపోయిన తెలుగు సినీ దర్శకుడు బోయపాటి శీనుకు ఎన్నికలు కలసివచ్చాయి. వినయ విధేయ రామతో తగ్గిన కలెక్షన్లను ఎన్నికల ప్రకటనల ద్వారా కుమ్మేశాడు. ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బోయపాటి.. అమరావతిలోనే వుండిపోయాడు. అలా ఎన్నికల కోసం టీడీపీకి ప్రకటనలు రూపొందించే పనిలో పడ్డాడు. 
 
ఇలా ఎన్నికల ప్రచారం నిత్యం టీవీలలో వచ్చిన ప్రకటనలను బోయపాటి రూపొందించినవే కావడం విశేషం. టీడీపీ కోసం అద్భుతమైన యాడ్స్‌ను బోయపాటి షూట్ చేసారు. ఈ ప్రకటనలు ఎవరు చేశారబ్బా అనేలా రూపొందించారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీ ప్ర‌చారానికి ఆయన చేసిన యాడ్స్ కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అయ్యింది. అంతేగాకుండా బోయపాటికి మంచి పారితోషికం కూడా ముట్టింది. 
 
అంత పెద్ద దర్శకుడు కదా ఎంత తీసుకుని వుంటాడు. యాడ్స్ నిమిత్తం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో బోయపాటి రూ.5 కోట్ల మొత్తం చేతికి అందుకున్నాడు. కానీ ఈ యాడ్స్ తయారికీ బోయపాటికి పట్టిన సమయం నెలన్నరేనని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు