ఇక టాప్ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐఎస్‌సీకి 186వ స్థానం దక్కింది. మన దేశంలోని ఐఐటీ బాంబే, ఢిల్లీ తర్వాత మూడో బెస్ట్ యూనివర్సిటీగా ఐఐఎస్‌సీ నిలిచింది. ఐఐటీ బాంబే తాజా ర్యాంకుల్లో 177వ స్థానం సంపాదించింది.
అయితే, ఈ దఫా కూడా దేశంలో బెస్ట్ కాలేజ్‌గా నిలిచినా.. గతేడాది 172వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే.. ఈసారి ఐదు ర్యాంకులు కోల్పోయింది. అటు ఐఐటీ ఢిల్లీ మాత్రం 193వ స్థానం నుంచి 185కు ఎగబాకింది. ఈ క్రమంలో ఐఐఎస్‌సీని వెనక్కి నెట్టింది.
మిగతా ఐఐటీల విషయానికి వస్తే ఐఐటీ మద్రాస్ 20 స్థానాలు ఎగబాకి 255కు చేరింది. ఐఐటీ ఖరగ్‌పూర్ 280, ఐఐటీ గౌహతి 395 ర్యాంకుల్లో నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్ తొలిసారి టాప్ 600లోకి తొలిసారి వచ్చింది. ప్రధానంగా ఆరు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను కేటాయించారు.
ఇక వరల్డ్ టాప్ యూనివర్సిటీగా వరుసగా పదోసారీ మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ రెండు, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు మూడో స్థానంలో ఉన్నాయి.