న్యూస్ చదువుతుంటే ఊడిన 'పన్ను' .. అదికాస్త కిందపడేలోపు....

శుక్రవారం, 17 జులై 2020 (17:23 IST)
సాధారణంగా న్యూస్ యాంకర్లు ఎంతో ఏకాగ్రతతో తమ విధులు నిర్వహిస్తుండాలి. అపుడే వారు వార్తలు స్పష్టంగా చదవగలుగుతారు. తమ మనస్సు ఏమాత్రం అటూఇటూ దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అంతేనా.. కళ్ళముందు ఏం కనిపించినా.. ఎలాంటి సంఘటన జరిగినా వాటినేంపట్టించుకోకుండా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. 
 
తాజాగా ఓ మహిళ న్యూస్ రీడర్ వార్తలు చదువుతుంటే.. ఉన్నట్టుండి ముందు భాగంలో ఉండే పై పన్ను ఊడిపోయింది. ఆ ఊడిపోయిన పన్నును క్షణకాలంలో చేతిలోకి తీసుకున్న యాంకర్... మిగిలిన వార్తను చదివి పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఉక్రెయిన్ టీవీ టీఎస్ఎస్ ఛాన‌ల్‌‌ న్యూస్ రీడర్ మరీచా పదాల్కో సీరియస్‌గా కరోనా వైరస్ సమాచారాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఆ సమయంలో పై పన్ను కదిలి, అది కాస్త ఊడి కిందపడేలోపే... చేతిలోకి లాగేసుకున్న‌ది. అయినా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. ఈ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు 'శ‌భాష్' అంటూ మెచ్చుకుంటున్నారు. పైగా, 'ఆమె ప‌న్ను తీసే విధానం చూస్తుంటే అది అల‌వాటైన ప‌నిలా ఉంది' అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆమెకు పన్ను ఊడిన సంగతి తీక్షణగా టీవీ చూస్తున్న వారే గుర్తుపట్టగలరని ఇంకొందరు అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Нова "слава" прийшла звідки не чекали .... і підтримка теж

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు