కరోనా వేళ పోలీసులు, జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 31 ఏళ్ల జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చూస్తూ ఓ వ్యక్తి అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆ ఫిర్యాదు చేసింది. బహిరంగంగా తనను చూస్తూ ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేశాడని.. ఈ తతంగం సీసీటీవీలో కూడా రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బెంగళూరు బనాస్వాడిలో చోటుచేసుకుంది.