మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా... నాకు పదవితో సంబంధం లేదంటూ...

శుక్రవారం, 20 మార్చి 2020 (13:43 IST)
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం కావాల్సి వుండగా అంతకంటే ముందుగానే ఆయన తన తన రాజీనామాను ప్రకటించారు. గవర్నర్ లాల్జీ టాండన్‌ను కలవడానికి మధ్యాహ్నం 1 గంటలకు రాజ్ భవన్‌ను సందర్శిస్తానని చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... బిజెపి నా సంకల్పాన్ని బలహీనపరచలేదు, నా రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను అన్నారు. పదవితో సంబంధం లేకుండా మేము ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటాం. నేను రాజీనామా చేయబోతున్నాను, ఈ విషయంలో గవర్నర్‌ను కలుస్తాను అని అన్నారు.
 
మరోవైపు బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాను మద్దతు ఇస్తానని స్వతంత్ర ఎమ్మెల్యే చెప్పారు. స్వతంత్ర ఎమ్మెల్యే ప్రదీప్ జైస్వాల్ మాట్లాడుతూ, "స్వతంత్ర ఎమ్మెల్యే కావడం, ఇప్పుడు నా ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను వారితో మాట్లాడాను. వారు కూడా నా మద్దతు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు"

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు