కేరళ పోలీసులు సూపర్.. అయ్యప్పనమ్ కోషియం పాటకు స్టెప్పులు.. వీడియో వైరల్

శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (20:59 IST)
కరోనావైరస్ మహమ్మారి సమయంలో చేతులు శుభ్రపరుచుకోవడం ఎలా అనేందుకు సరైన మార్గాన్ని కేరళ పోలీసులు బోధిస్తున్నారు. కేరళ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా వీరు విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసులు కోవిడ్ -19 నుండి తమను తాము రక్షించుకోవడానికి సబ్బుతో చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. 
 
94 సెకన్ల వీడియోలో, ఆరుగురు పోలీసులు ముసుగులు ధరించి, పృథ్వీరాజ్ మరియు బిజు మీనన్ నటించిన ఇటీవలి బాక్సాఫీస్ హిట్ అయ్యప్పనమ్ కోషియం నుండి ఒక పాటకు నృత్యం చేశారు.
 
దీనిని రాష్ట్ర పోలీసు మీడియా సెంటర్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. కేవలం 20 గంటల్లో, ఇది 38,000 వీక్షణలు మరియు 33,000 షేర్లను సంపాదించింది. కాగా కేరళలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  రోజువారీ కేసులు 30 వేలకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  
 
మొదటి వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కేరళ, సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడిపోతుంది.  కరోనా నుంచి బయటపడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పోలీసులు సిద్ధమయ్యారు. 
 
ఇటీవలే బాగా పాపులర్ అయిన ఎంజాయి ఎంజామి అనే సాంగ్ ను కరోనా మహమ్మారికి తగిన విధంగా రీమిక్స్ చేసి దానికి తగిన విధంగా పోలీసులు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.  
 
పోలీసులకు, సమాజానికి భయపడి మాత్రమే మాస్కులు పెట్టుకోవడం కాదని, దానిని ఒక అలవాటుగా మార్చుకుంటే తప్పకుండా కరోనాపై విజయం సాధించవచ్చని పోలీసులు చెప్తున్నారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది.


 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు