సిర్మౌర్ జిల్లాలో కొండ చరియలు వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

శుక్రవారం, 30 జులై 2021 (22:57 IST)
Landslides
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కుండపోత వానలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా, ఆ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనకి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలోని కాళి ధంక్‌ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకున్నా.. జాతీయ రహదారి ఒక్కసారిగా కుప్పకూలి లోయలోకి పడిపోయింది. సిర్మూర్‌లోని పాటా సాహిబ్ సిమ్లాలోని హట్కోటికి కలిపే నేషనల్ హైవే 707 మార్గంలోని దాదాపు 100 మీటర్ల రోడ్డు క్షణాల్లో జారి కిందకు పడిపోయింది.
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో.. పెద్ద కొండలోని ఓ భాగం కూలడం, దానితో పాటు రోడ్డు కూడా కుప్పకూలిన దృశ్యాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. హైవే కూలిపోయిన సమయంలో దానిపై వాహనాలేవీ లేవని, ప్రమాదం తర్వాత హైవేను తాత్కాలికంగా మూసేసి, వాహనాలను వేరే మార్గాలకు మళ్లించామని అధికారులు చెప్పారు.

#Landslide in a remote part of #Himachal’s #Sirmaur district.

Courtesy : Manjeet Sehgal/India Today pic.twitter.com/GTI58X2nFs

— Rupin Sharma IPS (@rupin1992) July 30, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు