అయితే, ఆ పోస్టర్ దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులోకి కాళీ చేతిలో సిగరెట్ కన్పించడం, వెనుకవైపు స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి దారితీశాయి.
"జానపద రంగస్థల కళాకారులు తమ ప్రదర్శనలను ఎలా పోస్ట్ చేస్తారో బిజెపి పేరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమా నుంచి వచ్చినది కాదు. ఈ సంఘ్ పరివార్లు తమ అలుపెరగని ద్వేషం మరియు మతపరమైన మతోన్మాదంతో నాశనం చేయాలని కోరుకునే రోజువారీ గ్రామీణ భారతదేశం నుండి ఇది. హిందుత్వ ఎప్పటికీ భారతదేశం కాజాలదు." అంటూ ఆమె పేర్కొన్నారు.