ఆధార్ - పాన్ కార్డ్ లింక్ చేయకపోయారో... ఇక అంతేసంగతులు...

శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (21:46 IST)
ఆధార్ కార్డ్ - పాన్ కార్డ్ లింక్ చేయకపోతే అంతేసంగతులు అనే ప్రచారం ఊపందుకుంది. మార్చి 31 లోపుగా ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయనట్లయితే పాన్ కార్డ్ రద్దవుతుందని అంటున్నారు. అందువల్ల పాన్ కార్డ్ - ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో దీని గురించి పెద్దఎత్తున ప్రచారం జరిగుతోంది. 
 
మరోసారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దీని గురించి చెపుతూ... ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌, పాన్‌ కార్టులను అనుసంధానం చేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది. మార్చి నెల 31 లోపుగా ఈ ప్రక్రియను పన్ను చెల్లింపుదారులు పూర్తి చేసుకోవాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న ఇచ్చిన తీర్పులో ఆధార్-పాన్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి అని ఇచ్చిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు