ఆ సమయంలో దిగిన ఒక ఫొటోను మహేశ్ బాబు శ్రీమతి నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. 'ప్యారిస్ లో ఒక సాయంత్రం అద్భుతంగా గడిచింది' అంటూ మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఈ ఫొటోలో మహేశ్ బాబును చూసినవారంతా గౌతమ్‌కు సోదరుడిలా కనిపిస్తున్నారని కితాబిస్తున్నారు. ఇంకా సితార ఆ ఫోటోలో కనిపించకపోవడంతో.. ఆమె ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు.