సీమాన్‌పై ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఏడు సార్లు అబార్షన్లు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన వాంగ్మూలం ఇచ్చింది. దీని ఆధారంగా సీమాన్‌పై వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు.
దీని ప్రకారం ఈ ఉదయం విజయలక్ష్మిని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన సమాచారం, మెడికల్ రిపోర్టు ఆధారంగా సీమాన్‌పై వచ్చిన ఫిర్యాదులో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.